﻿కీర్తన.
67.
ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాద్యాలపై పాడేది. దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక 
భూమి మీద నీ మార్గాలు, జాతులన్నిటిలో నీ రక్షణ వెల్లడి అయ్యేలా అలా చేస్తాడు గాక. 
దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక. 
ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు. 
దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలందరు నిన్ను స్తుతిస్తారు గాక. 
అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. 
దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు. 
