﻿కీర్తన.
114.
ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు, 
యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది. 
సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది. 
పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి. 
ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి? 
పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు? 
భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు. 
ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు. 
