﻿కీర్తన.
134.
యాత్రల కీర్తన యెహోవా సేవకులు, ఆయన మందిరంలో రాత్రివేళ నిలిచి సేవించే వాళ్ళంతా రండి. యెహోవాను కీర్తించండి. 
పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి. 
భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవా సీయోనులోనుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. 
